Amaravati updates:స్టేటస్ కో ఆదేశాలు ఉన్నపటికీ విశాఖపట్నం లో ప్రభుత్వం పరిపాలన రాజధాని ఏర్పాట్లు చేస్తోంది.

అమరావతి:

-స్టేటస్ కో ఆదేశాలు ఉన్నపటికీ విశాఖపట్నం లో ప్రభుత్వం పరిపాలన రాజధాని ఏర్పాట్లు చేస్తోంది.

-30 ఎకరాల్లో ప్రభుత్వం స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిందన్న పిటిషనర్ తరుపు న్యాయవాది నిదేష్ గుప్తా

-గెస్ట్ హౌస్ మాటున ప్రభుత్వం పరిపాలన రాజధాని కోసం నిర్మాణాలు చేపడుతోంది.

-ఢిల్లీ లో రాష్ట్రపతి భవనం 5 ఎకరాల్లో నిర్మించారు. ఇందులో 350 గదులు ఉన్నాయి.

-పిటిషనర్ వాదనలు తోసి పుచ్చిన ఎజి ...

-వివిఐపిల కోసం ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మిస్తుందన్న అడ్వకేట్ జనరల్

-గెస్ట్ హౌస్ నిర్మాణం పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం.

-కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజుల సమయం కోరిన అడ్వకేట్ జనరల్.

-ఈ వ్యవహారాన్ని సెప్టెంబర్ 10న విచారిస్తామన్న హైకోర్టు.

-చట్టాలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్స్ పై కౌంటర్ అఫిడవిట్ లు దాఖలు చేయాలని ప్రభుత్వం తరుపు న్యాయవాదులను ఆదేశించిన కోర్టు.

-సెప్టెంబర్ 21 నుంచి Regular హియరింగ్ చేపడతామన్న హైకోర్టు

-సోమవారం నుంచి శుక్రవారం వరకు వరుస పనిదినాల్లో విచారణ చేస్తామన్న హైకోర్టు

-సోషల్ డిస్టెన్స్ పాటిస్తే ప్రత్యక్ష విచారణ చేపడతామన్న ధర్మాసనం.

-ప్రస్తుత దేశంలో ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో ప్రత్యక్షంగా.. ఆన్లైన్ ద్వారా హైబ్రిడ్ పద్ధతిలో విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసిన ప్రభుత్వ తరుపు న్యాయవాది రాకేష్ ద్వివేది.

-కేసును సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం తాను విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నానాన్న రాకేష్ ద్వివేది.

-శాసన మండలి చైర్మన్ సంతకాలు చేయకుండా ప్రభుత్వం బిల్లులను governer కి పంపించిందన్న పిటిషనర్ తరుపు న్యాయవాది జంధ్యాల రవి శంకర్.

-రానున్న పదిరోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాము.

-ప్రభుత్వ కౌంటర్ పై పిటిషనర్లు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని కోరుతున్నాం.

Update: 2020-08-27 07:44 GMT

Linked news