విశాఖ ఘటనపై స్పందించిన మంత్రి గౌతంరెడ్డి

విశాఖపట్నం: విశాఖ రాంకీ ఫార్మాసిటీలోని ‘విశాఖ సాల్వెంట్స్‌’ సంస్థలో సోమవారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. పేలుడుకు గల కారణాలను జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదం జరిగిన సమయంలో సంస్థలో నలుగురు సిబ్బంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. తీవ్రంగా గాయపడిన మల్లేశ్వరరావును రాత్రి 12 గంటల సమయంలో గాజువాకలోని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Update: 2020-07-14 06:29 GMT

Linked news