నేడు కడపకు సీఎం జగన్‌

రేపు వైఎస్‌ జయంతి సందర్భంగా ఘాట్‌ వద్ద నివాళి

కడప: సీఎం జగన్‌ మంగళవారం తన సొంత జిల్లా కడపకు వెళ్లనున్నారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకుని కడపకు చేరుకుని ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు వెళ్తారు.

రాత్రి అక్కడే బస చేస్తారు. బుధవారం వైఎస్‌ జయంతి వేడుకలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 8.50 గంటలకు ట్రిపుల్‌ ఐటీకి చేరుకుని నూతన అకడమిక్‌ కాంప్లెక్స్‌, ఎండబ్ల్యూ సోలార్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.  సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ హరికిరణ్‌ పర్యవేక్షించారు. 

రైతు భరోసా కేంద్రాలకు వైఎస్సార్‌ పేరు.

అమరావతి: రైతు భరోసా కేంద్రాలను ‘డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు’గా మార్చారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2020-07-07 02:03 GMT

Linked news