Bank FD And Corporate FD: బ్యాంకు ఎఫ్డీ, కార్పొరేట్‌ ఎఫ్డీ మధ్య తేడా ఏంటి.. లాభనష్టాలు భేరీజు వేయండి..!

Bank FD And Corporate FD: ఈ రోజుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకులు అత్యదిక వడ్డీని అందిస్తున్నాయి. అంతేకాదు ఖాతాదారుడికి వారి డబ్బుపై భద్రతను అందిస్తాయి.

Update: 2024-02-06 15:00 GMT

Bank FD And Corporate FD: బ్యాంకు ఎఫ్డీ, కార్పొరేట్‌ ఎఫ్డీ మధ్య తేడా ఏంటి.. లాభనష్టాలు భేరీజు వేయండి..!

Bank FD And Corporate FD: ఈ రోజుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకులు అత్యదిక వడ్డీని అందిస్తున్నాయి. అంతేకాదు ఖాతాదారుడికి వారి డబ్బుపై భద్రతను అందిస్తాయి. అయితే కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మరింత వడ్డీని అందిస్తాయి. దేశంలో చాలా మందికి బ్యాంక్ ఎఫ్‌డి గురించి తెలుసు కానీ కార్పొరేట్ ఎఫ్‌డి గురించి తెలియదు. బ్యాంక్ FD, కార్పొరేట్ FD మధ్య తేడాలు, లాభనష్టాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బ్యాంక్ FD

బ్యాంక్ FD అనేది ఒక రకమైన ఆర్థిక పెట్టుబడి. ఇందులో ప్రజలు తమ డబ్బును కొంత కాలానికి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. దీనిపై బ్యాంకు స్థిరమైన వడ్డీ చెల్లిస్తుంది. ఒకవేళ అత్యవసరం వచ్చి FD విత్‌ డ్రా చేస్తే అందులో నుంచి కొంత మొత్తాన్ని జరిమానాగా కట్‌చేస్తారు.

కార్పొరేట్ FD

కార్పొరేట్ FD అనేది ఒక రకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇతర కంపెనీలు ఇన్వెస్టర్లను నిర్ణీత కాలానికి డబ్బు డిపాజిట్ చేయడానికి అనుమతిస్తాయి. బ్యాంకుల కంటే ఈ కంపెనీలు ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి. ఇవి కంపెనీ చట్టం ప్రకారం డిపాజిట్లు తీసుకునే హక్కు కలిగి ఉంటాయి.

కార్పొరేట్ FD ప్రయోజనాలు

కార్పొరేట్ ఎఫ్‌డిలో డిపాజిట్ చేసిన మొత్తంపై లభించే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేయడం మంచిదని చాలామంది భావిస్తారు. బ్యాంక్ FDతో పోలిస్తే కార్పొరేట్ FD నుంచి తక్కువ సమయంలో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. రూ.5 లక్షల వరకు పెట్టుబడిదారుల డబ్బు బ్యాంక్ FDలో భద్రంగా ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ కింద బ్యాంక్ FDలు బీమా చేసి ఉంటాయి. కార్పొరేట్ FDలో ఫైనాన్షియల్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందులోని కంపెనీలు ఎటువంటి చట్టబద్ధమైన హామీని ఇవ్వవు.

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు బ్యాంకులతో పోలిస్తే అత్యధిక వడ్డీని అందిస్తాయి. కార్పొరేట్ FDకి డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ ఏదీ ఉండదు. కాబట్టి FDలో డబ్బును డిపాజిట్ చేసే ముందు CRISIL, CARE లేదా ICRA వంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు కంపెనీకి ఇచ్చిన రేటింగ్‌ను ఖచ్చితంగా చెక్‌ చేయాలి. కార్పొరేట్ FDపై రుణం తీసుకున్నప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేటు కంటే 2 శాతం ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాయి.

Tags:    

Similar News