Stock Market: టారిఫ్ వార్ తో కుదేలైన స్టాక్ మార్కెట్లు
Stock Market: భారత్ పై అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరికతో స్టాక్ మార్కెట్లు ఇవాళ కుప్పకూలాయి.
Stock Market: భారత్ పై అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరికతో స్టాక్ మార్కెట్లు ఇవాళ కుప్పకూలాయి. మార్కెట్ మహా పతనంతో ఓక్కరోజే రూ. 8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. టారిఫ్ వార్ తో పాటు ఎఫ్ఐఐల అమ్మకాలు, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలతో కీలక సూచీలు కుదేలయ్యాయి.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు భారత్ నిలిపివేయకుంటే అదనపు సుంకాలు తప్పవన్న ట్రంప్ వార్నింగ్ తో కొద్ది సెషన్ లుగా మార్కెట్లు పతనాల బాట పట్టాయి. మొత్తంమీద సెన్సెక్స్ 780 పాయింట్ల నష్టంతో 84,180 పాయింట్ల వద్ద ముగియగా, 263 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 25,876 పాయింట్ల వద్ద ముగిసింది.