Stock Market Crash Today: స్టాక్ మార్కెట్లకు ట్రంప్ 'టారిఫ్' దెబ్బ: 376 పాయింట్లు పతనమైన సెన్సెక్స్.. కారణాలు ఇవే!
Stock Market Crash Today: స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. లాభాల స్వీకరణతో పాటు ఎఫ్ఐఐల నిష్క్రమణతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
Stock Market Crash Today: స్టాక్ మార్కెట్లకు ట్రంప్ 'టారిఫ్' దెబ్బ: 376 పాయింట్లు పతనమైన సెన్సెక్స్.. కారణాలు ఇవే!
Stock Market Crash Today: స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. లాభాల స్వీకరణతో పాటు ఎఫ్ఐఐల నిష్క్రమణతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. హెచ్ డీఎఫ‌్ సీ సహా దిగ్గజ షేర్లలో సెల్లింగ్ జరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయకుంటే టారిఫ్ లు పెంచుతామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేసింది.
మరోవైపు భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రతికూల ప్రభావం చూపాయి. మొత్తంమీద సెన్సెక్స్ 376 పాయింట్ల నష్టంతో 85,063 పాయింట్ల వద్ద ముగియగా, 71 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 26,178 పాయింట్ల వద్ద క్లోజయింది.