5G Service: 5G సేవలు పొందడానికి సిమ్ మార్చాలా.. టారిఫ్‌లు అధికంగా ఉంటాయా..?

5G Service: 5G సేవలు పొందడానికి సిమ్ మార్చాలా.. టారిఫ్‌లు అధికంగా ఉంటాయా..?

Update: 2022-09-10 08:00 GMT

5G Service: 5G సేవలు పొందడానికి సిమ్ మార్చాలా.. టారిఫ్‌లు అధికంగా ఉంటాయా..?

5G Service: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యూజర్లని కలిగి ఉన్నాయి. రెండు కంపెనీలు కూడా 5జీ కనెక్షన్‌ను ప్రకటించాయి. జియో, ఎయిర్‌టెల్‌ 5G కనెక్షన్ల కోసం అధిక టారిఫ్‌లను వసూలు చేయకూడదని నిర్ణయించుకున్నాయి. అంటే రెండు కంపెనీల కస్టమర్లు ఇప్పటికే ఉన్న 4-G టారిఫ్‌పై మాత్రమే 5-G సేవలని పొందగలుగుతారు. దీపావళి సందర్భంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలోని అనేక ప్రాంతాల్లో 5G సేవను ప్రారంభించనున్నట్లు జియో, ఎయిర్టెల్‌ తెలిపాయి.

మార్కెట్‌లో 5జీ ఫోన్లు తక్కువ

ప్రస్తుతం దేశంలో 5G ఫోన్‌ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ప్రస్తుత 5G హ్యాండ్‌సెట్‌లు కూడా నిర్దిష్ట స్పెక్ట్రమ్ బ్యాండ్‌లకు మద్దతు ఇవ్వవు. అందువల్ల 5G సేవ ప్రారంభ దశలో ఎక్కువ మంది యూజర్లని పొందడం కష్టమని కంపెనీలు భావిస్తున్నాయి. దీని కారణంగా 5G ప్లాన్‌లను విడివిడిగా ప్రారంభించకుండా రెండు కంపెనీలు ఒక ఒప్పందం ప్రకారం 5G సేవలను అందించాలని యోచిస్తున్నాయి.

సిమ్ మారదు..

4G నుంచి 5G సేవకు అప్‌గ్రేడ్ చేసిన తర్వాత SIM మార్చవలసిన అవసరం లేదు. టెలికాం ఆపరేటర్లు మీకు 5G హ్యాండ్‌సెట్‌ని కలిగి ఉన్నారని తెలియజేయాలి. ఈ పరిస్థితిలో కంపెనీలు కస్టమర్‌లకు మెస్సేజ్‌ ద్వారా 4G కనెక్షన్‌ను నేరుగా 5Gకి మారుస్తాయి. ఎయిర్‌టెల్‌, జియో దాదాపు ఒకేసారి 5G సేవను ప్రారంభించబోతున్నాయి.

దీపావళి సందర్భంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలోని కీలక ప్రాంతాలలో 5G సేవలను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు.దీంతో పాటు డిసెంబర్ 2023 నాటికి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 5G సేవలను ప్రారంభించడం గురించి మాట్లాడారు.అదే సమయంలో భారతీ ఎయిర్‌టెల్ తన 5G సేవలను అక్టోబర్‌లోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్చి 2024 నాటికి దేశంలోని 5000 కంటే ఎక్కువ నగరాలు, పట్టణాలకు ఈ సేవను విస్తరించాలని భావిస్తోంది.

Tags:    

Similar News