అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ: 'బిల్డ్ హ్యాపినెస్' నినాదంతో కొత్త ప్రయాణం!
Anvitha Group: రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న 'అన్విత గ్రూప్' తమ సంస్థ ముఖచిత్రంగా నటసింహం నందమూరి బాలకృష్ణను ఎంచుకుంది.
Anvitha Group: రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న 'అన్విత గ్రూప్' తమ సంస్థ ముఖచిత్రంగా నటసింహం నందమూరి బాలకృష్ణను ఎంచుకుంది. సంస్థ చైర్మన్ మరియు ఎండీ అచ్యుతరావు బొప్పన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, బాలయ్య వ్యక్తిత్వం తమ సంస్థ విలువలకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.
బాలయ్య ఎంపికపై అచ్యుతరావు బొప్పన వ్యాఖ్యలు:
"ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం, బసవతారకం ఆసుపత్రి ద్వారా అందిస్తున్న ఆరోగ్య సేవలు, హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లో ఆయన చూపిస్తున్న నిబద్ధత అందరికీ ఆదర్శం. 'మాట తప్పని, మడమ తిప్పని' ఆయన నైజం, అన్విత గ్రూప్ నమ్మకానికి సరిగ్గా సరిపోతుంది. అందుకే ఆయనను మా బ్రాండ్ అంబాసిడర్‌గా ఆహ్వానించాం" అని అచ్యుతరావు తెలిపారు.
అన్విత గ్రూప్ ప్రాజెక్టుల ప్రస్థానం:
గత 20 ఏళ్లుగా దుబాయ్, అబుదాబిలో సుమారు 4 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలను పూర్తి చేసిన ఈ సంస్థ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించింది:
హైదరాబాద్: కొల్లూరులో 'అన్విత ఇవానా', మేడ్చల్‌లో 'అన్విత పార్క్‌సైడ్', మరియు 'అన్విత హై నైన్' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టింది.
అమెరికా: డల్లాస్‌లో ఒక భారీ లైఫ్‌స్టైల్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తోంది.
ఏపీ: విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నగరంలోనే అత్యంత ఎత్తైన భవనాలను నిర్మించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
లక్ష్యం: ఏడాదికి 1000 ఇళ్లు!
రాబోయే 5-6 ఏళ్లలో ప్రతి ఏటా వెయ్యి యూనిట్లను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ డైరెక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం బొప్పన, శ్రీకాంత్ బొప్పన, విజయరాజు తదితరులు పాల్గొన్నారు.