Agriculture: రూ.20 వేలు పెట్టుబడి పెట్టి రూ.5 లక్షలు సంపాదించండి.. తక్కువ ఖర్చు ఎక్కువ లాభం..!

Agriculture: కొంతమందికి ఉద్యోగం చేయడం అంటే ఇష్టం ఉండదు. సొంతంగా వ్యవసాయం కానీ వ్యాపారం కానీ చేయాలనుకుంటారు.

Update: 2023-09-10 13:53 GMT

Agriculture: రూ.20 వేలు పెట్టుబడి పెట్టి రూ.5 లక్షలు సంపాదించండి.. తక్కువ ఖర్చు ఎక్కువ లాభం..!

Agriculture: కొంతమందికి ఉద్యోగం చేయడం అంటే ఇష్టం ఉండదు. సొంతంగా వ్యవసాయం కానీ వ్యాపారం కానీ చేయాలనుకుంటారు. అలాంటి వారు నిమ్మగడ్డి పండించి మంచి లాభాలు సంపాదించవచ్చు. కానీ ఇందుకోసం వ్యవసాయ భూమి ఉండాలి. అప్పుడు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చు. కేవలం రూ.20 వేలు పెట్టి 5 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ పంట గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నిమ్మ గడ్డి ఒక ఔషధ పంట. దీని నుంచి సువాసన ఉత్పత్తులు తయారు చేస్తారు. అంతేకాకుండా మందులు కూడా తయారు చేస్తారు. ఇందులో ఉండే ఔషధ గుణాల వల్ల రోగాలు దరిచేరవు. అందువల్ల పంటకు నష్టం వాటిల్లుతుందన్న భయం కూడా ఉండదు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో లెమన్ గ్రాస్ గురించి ప్రస్తావించారు. నిజానికి నిమ్మ గడ్డి ఒక వాణిజ్య పంట. నాటిన 4 నెలల తర్వాత కోతకి సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం లెమన్ గ్రాస్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది.

రూ.20 వేలతో వ్యాపారం

బంజరు భూమిలో కూడా నిమ్మ గడ్డిని సాగు చేసుకోవచ్చు. ఈ పంటకు ఎక్కువ ఎరువులు అవసరం లేదు. కనీసం రూ.20 వేలు పెట్టుబడి పెట్టి సాగు ప్రారంభించవచ్చు. 6 ఏళ్లలో రూ.4 నుంచి 5 లక్షల వరకు లాభం పొందవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే ఒకసారి వ్యవసాయం చేయడం మొదలుపెడితే 4 నుంచి 6 ఏళ్ల వరకు ఉత్పత్తి వస్తూనే ఉంటుంది.

Tags:    

Similar News