Gold, Silver Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గా, వెండి ధరలు కూడా బంగారం బాటలోనే ట్రేడ్ అవుతున్నాయి.

Update: 2021-06-20 01:29 GMT

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. గత వారం నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ బులియన్ మార్కెట్‌ ప్రకారం.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. తాజాగా బంగారం ధరల్లో మార్పులేమీ చోటుచేసుకోలేదు. దేశంలో స్థిరంగానే కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం బంగారం ధర భారీగా తగ్గింది. తాజాగా దేశీయంగా 10 గ్రాముల బంగారంపై రూ.1,120 వరకు తగ్గుముఖం పట్టగా, కిలో వెండి ధరపై రూ.11000 ల వద్ద కొనసాగుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300 ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,220 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,920 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000ల వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతుంది. ఇక తాజాగా దేశీయంగా కిలో వెండిపై రూ.1100 వరకు తగ్గుముఖం పట్టింది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, చెన్నైలో రూ.73,100 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, కోల్‌కతాలో రూ.67,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, కేరళలో రూ.67,600 ఉంది. ఇక

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,100 ఉండగా, విజయవాడలో రూ.73,100 వద్ద కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 20-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News