India Cars: వేగంగా విస్తరిస్తున్న సెకండ్ హ్యాండ్ మార్కెట్.. సాక్ష్యాలు ఇవే!
India Cars: ద్వితీయంగా, 'స్మార్ట్ కన్సంప్షన్' అనే మానసిక మార్పు. నూతన హోండా సిటీ కన్నా వాడిన ఆడి కొనడం లాభంగా అనిపించే రోజుల్లో జీవిస్తున్నాం.
India Cars: వేగంగా విస్తరిస్తున్న సెకండ్ హ్యాండ్ మార్కెట్.. సాక్ష్యాలు ఇవే!
India Cars: ఒకప్పుడు ఢిల్లీ ఫార్మ్‌హౌస్‌ల ముందు లేదా ముంబై సముద్రతీరాల్లో మాత్రమే కనిపించే లగ్జరీ కార్లు, ఇప్పుడు భారత్‌లోని సెకండ్‌హ్యాండ్ మార్కెట్లో వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా ఒక గ్లోబ్‌న్యూస్‌వైర్ నివేదిక ప్రకారం, భారత్‌లో ప్రీ-ఓన్డ్ లగ్జరీ కార్ల మార్కెట్ 2024 నుంచి 2032 మధ్య 16.3 శాతం వార్షిక వృద్ధిరేటుతో అభివృద్ధి చెందనుంది. ఇది కొత్త లగ్జరీ కార్ల మార్కెట్ కంటే రెట్టింపు వేగంతో దూసుకుపోతోందంటే ఆశ్చర్యం లేదు.
ఇదంతా దేశంలోని పెరుగుతున్న డిస్పోజబుల్ ఆదాయాల వల్ల మాత్రమే కాదు. లగ్జరీ కార్లకు డిమాండ్ పెరగడం వెనుక అసలు కారణం.. అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి, దాని అహంకార సంకేతాలే. చిన్న పట్టణాల్లోనూ బీఎండబ్ల్యూ, ఆడి వాహనాలు నడుస్తుండటం.. లగ్జరీ గ్లామర్‌ను అందరికీ అందుబాటులోకి తెస్తోంది. ఈ ట్రెండ్ చూస్తే.. భారత్‌లో విజయాన్ని ఎలా నిర్వచిస్తున్నారో స్పష్టమవుతుంది. ఇమేజ్‌కు ఇచ్చే ప్రాధాన్యం స్పష్టంగా కనిపిస్తుంది.
వాస్తవానికి, ఈ వృద్ధికి పలు కారణాలున్నాయి. మొట్టమొదటిది.. పరిమిత నమ్మకంతో ఉన్న మార్కెట్‌కి రిప్యుటబుల్ కంపెనీలు, డీలర్ల ప్రవేశం. మెర్సిడెస్ బెంజ్ లాంటి బ్రాండ్లు 'ప్రూవెన్ ఎక్స్‌క్లూజివిటీ' అనే సర్టిఫైడ్ యూజ్డ్ కార్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టగా, స్పిన్నీ మ్యాక్స్, బిగ్ బాయ్ టాయ్జ్ వంటి స్టార్టప్‌లు సెకండ్‌హ్యాండ్ లగ్జరీకి ట్రస్టబిలిటీ జోడించాయి.
ద్వితీయంగా, 'స్మార్ట్ కన్సంప్షన్' అనే మానసిక మార్పు. నూతన హోండా సిటీ కన్నా వాడిన ఆడి కొనడం లాభంగా అనిపించే రోజుల్లో జీవిస్తున్నాం. బ్రాండ్ విలువను కొనుగోలు చేసే తరం ఇది. ప్రెస్టీజ్‌ను పరిమిత ఖర్చుతో పొందగలగడమే ఈ మార్గం. దీనికి తోడు, మెరుగైన రీపేర్ సెంటర్లు, స్పేర్ పార్ట్స్, బ్యాంకు లోన్ సదుపాయాలు డిమాండ్‌ను మరింత బలపరిచాయి.
డిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నా, టైర్ 2 నగరాలు – ముఖ్యంగా డిల్లీ పరిసరాలు – ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇందుకు ముఖ్య కారణం డిల్లీలో ఉన్న 10 ఏళ్ల డీజిల్ నిషేధం. ఫలితంగా ఢిల్లీ బయట ఉన్న నగరాల్లో సెకండ్‌హ్యాండ్ డీజిల్ లగ్జరీ కార్లు తక్కువ ధరలకు దొరుకుతున్నాయి.
కొనుగోలు దారుల ప్రొఫైల్ విషయానికి వస్తే.. 30 నుంచి 50 ఏళ్ల వయసుగల యువ ఉద్యోగులు, ఎంట్రప్రెన్యూర్‌లు, ఫ్యామిలీ బిజినెస్ వారసులు ఎక్కువ. ఎక్కువమంది ఫైనాన్స్‌పై కార్లు కొనుగోలు చేస్తారు. ప్రస్తుత ట్రెండ్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న మోడళ్లలో మెర్సిడెస్ సి-క్లాస్, బీఎండబ్ల్యూ ఎక్స్1/ఎక్స్3, ఆడి క్యూ3/క్యూ5 ముందుంటాయి.
ఈ ట్రెండ్ అంతగా ప్రాముఖ్యత పొందిన అసలు కారణం. లగ్జరీకు కొత్త నిర్వచనం. సంపత్తికి సూచికగా ఉండే ప్రాపర్టీ, బంగారం, పెళ్లి ఖర్చులతో పాటు, ఇప్పుడు లగ్జరీ వాహనం కూడా ఒక విజయ సూచికగా మారింది. నూతన కార్లు అందుబాటులో లేకపోయినా, వాడిన కారుతో ఫస్ట్-క్లాస్ లైఫ్‌స్టైల్‌ను బలంగా ప్రకటించగలగడం.. ఇదే ఈ అభివృద్ధి వెనుక నిజమైన డ్రైవింగ్ ఫోర్స్.