Royal Enfield Sales 2025: కొత్త జోష్‌తో 2026లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎంట్రీ.. దుమ్ములేపుతున్న సేల్స్..!
Royal Enfield Sales 2025: 2025లో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు జోరుగా జోరుగా కొనసాగాయి. ముఖ్యంగా డిసెంబర్ 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ అద్భుతంగా ఉన్నాయి.
Royal Enfield Sales 2025: 2025లో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు జోరుగా జోరుగా కొనసాగాయి. ముఖ్యంగా డిసెంబర్ 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ అద్భుతంగా ఉన్నాయి. 2025 చివరి నెలలో ఏకంగా 1,03,574 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది డిసెంబర్ లో 79,466 యూనిట్లు అమ్మగా, ఇప్పుడు ఏకండా 30 శాతం వార్షిక వృద్ధి పెరిగింది. రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయ అమ్మకాలు 93,177 యూనిట్లు కాగా, గత ఏడాది ఇదే నెలలో 67,891 యూనిట్లతో పోలిస్తే 37 శాతం ఎక్కువ వృద్ధిని సాధించింది. ఎగుమతులు విషయానికి వస్తే, 10,397 యూనిట్లు ఉన్నాయి. గత ఏడాది 11,575 యూనిట్లతో పోలిస్తే 10 డౌన్ ఫాల్ కనిపించింది.
రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు పెరగడానికి పలు కారణాలు దోహదపడ్డాయి. ఫెస్టివల్ సీజన్ డిమాండ్, కొత్త మోడల్ లాంచ్‌ల కారణంగా కొనుగోళ్లు పెరిగాయి. హంటర్ 350, క్లాసిక్ 350, మీటియోర్ 350 లాంటి మోడల్స్ లాంచ్ అయ్యాయి. దేశీయ మార్కెట్ లో మంచి ఆదరణ, రైడర్ కమ్యూనిటీతో బలమైన కొనుగోళ్లకు కారణం అయ్యాయి. మొత్తంగా 2025 క్యాలెండర్ ఇయర్ కు రాయల్ ఎన్‌ఫీల్డ్ జోష్ ఫుల్ గా శుభకార్డు వేసింది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ లో మొత్తం 9,21,098 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024తో పోల్చితే 2025లో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఈ ఏడాదిలో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాల పట్ల ఐషర్ మోటార్స్ ఎండీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవో బి. గోవిందరాజన్ సంతోషం వ్యక్తం చేశారు. “డిసెంబర్ 2025 రాయల్ ఎన్‌ఫీల్డ్ బాగా కలిసి వచ్చింది. బలమైన వృద్ధిని సాధించింది. రికార్డు స్థాయిలో అమ్మకాలు కొనసాగాయి. రైడింగ్ కమ్యూనిటీతో మార్కెట్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా 350cc సెగ్మెంట్ లో సత్తా చాటింది” అని చెప్పుకొచ్చారు.
అందుబాటులోకి కొత్త మోడల్స్
ఇక రాయల్ ఎన్ఫీల్డ్ నవంబర్‌లో గోవాలో పలు కొత్త మోడల్స్ ను లాంచ్ చేసింది. మీటియోర్ 350 సన్ డౌనర్ ఆరెంజ్‌ను ను ఆవిష్కరించింది. రూ. 2.19 లక్షల ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది. హిమాలయన్ 450 ఆఫ్ రోడ్ వెర్షన్, హిమాలయన్ బ్లాక్ ఎడిషన్ ను రూ. 3.37 లక్షలకే విడుదల చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650, ఫ్లయింగ్ ఫ్లీ S6ను కూడా గోవాలో ఆవిష్కరించింది. బుల్లెట్ 650 ఈ నెలాఖరులో భారత మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎలక్ట్రిక్ S6 స్క్రాంబ్లర్ 2026 చివరి నాటికి ఇండియన్ రోడ్లపై దూసుకెళ్లనుంది. ఇటీవల, కంపెనీ భారత్ లో ఫ్లయింగ్ ఫ్లీ S6 డిజైన్‌కు పేటెంట్ ను తీసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా తన మోడల్ లైనప్ ను పెంచడానికి రాయల్ ఎన్ఫీల్డ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లతో పాటు, 2026 మిడ్ ఇయర్ నాటికి దేశీయ మార్కెట్లో పూర్తిగా ఎలక్ట్రిక్ అర్బన్ కమ్యూటర్, దాని మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అయిన ఫ్లయింగ్ ఫ్లీ C6ని కూడా విడుదల చేయనుంది. 2026 చివరి నాటికి హిమాలయన్ 750 కూడా రెడీ కాబోతోంది.