Car Safety Features: కొత్త కారు కొనేటప్పుడు ఈ 5 సేఫ్టీ ఫీచర్లను గమనించండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం..!

Car Safety Features: కొత్త కారు కొనేటప్పుడు కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది భద్రత గురించి.

Update: 2023-11-15 15:30 GMT

Car Safety Features: కొత్త కారు కొనేటప్పుడు ఈ 5 సేఫ్టీ ఫీచర్లను గమనించండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం..!

Car Safety Features: కొత్త కారు కొనేటప్పుడు కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది భద్రత గురించి. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న కారు ప్రమాదం జరిగినప్పుడు మీ ప్రాణాలను కాపాడుతుంది. అందువల్ల కారును కొనుగోలు చేసేటప్పుడు కొన్ని బేసిక్‌ సేఫ్టీ ఫీచర్స్‌ను గమనించాలి. దీనితో పాటు కారు భద్రతా రేటింగ్‌ను చెక్‌ చేయాలి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

ఎయిర్ బ్యాగ్స్

ఎయిర్‌బ్యాగ్‌లు కారు ప్రమాదానికి గురైనప్పుడు ప్రాణాలను కాపాడుతాయి. వీటిలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్, సైడ్ ఎయిర్‌బ్యాగ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్ మొదలైనవి ఉంటాయి. డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ డ్రైవర్‌ను రక్షిస్తుంది, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ ముందు ప్రయాణీకులను రక్షిస్తుంది. అలాగే ఇతర ఎయిర్‌బ్యాగ్‌లు వివిధ రకాల భద్రతను అందిస్తాయి. కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న కారును కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం ఉత్తమం.

యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)

బ్రేకింగ్ సమయంలో చక్రాలు లాక్ కాకుండా ABS నిరోధిస్తుంది. కారుని సులభంగా కంట్రోల్‌ చేయవచ్చు. ABS లేని కార్లు బ్రేక్‌లు వేసినప్పుడు తరచుగా రోడ్డుపై జారిపోతాయి. ABS అమర్చిన కార్లు బ్రేకింగ్ సమయంలో రోడ్డుపై జారకుండా ఉంటాయి.

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)

ESC కారు కంట్రోల్‌లో ఉంటుంది. తడి లేదా మంచుతో నిండిన రోడ్లపై కారును నడుపుతున్నప్పుడు ఇది చాలా అవసరం. ESC కారు చక్రాల వేగం, దిశ, సెన్సార్ల నుంచి డేటాను అనుసరించి కారు కంట్రోల్‌ తప్పకుండా చూస్తుంది.

క్రాష్ టెస్ట్ రేటింగ్

ఒక కారు క్రాష్ టెస్ట్ రేటింగ్ ప్రమాదంలో కారు ఎంత సురక్షితంగా ఉంటుందో సూచిస్తుంది. కారును కొనుగోలు చేసేటప్పుడు కారు క్రాష్ టెస్ట్ రేటింగ్‌ను ఖచ్చితంగా చెక్‌చేయాలి. 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్లు సురక్షితమైనవిగా చెప్పవచ్చు.

Tags:    

Similar News