EV Scooters: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనే వారికి పండగే.. అమెజాన్‌లో అదిరిపోయే డీల్స్‌..!

EV Scooters: రోజురోజుకీ పెరుగుతోన్న ఇంధన ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది.

Update: 2025-02-13 11:13 GMT

EV Scooters: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనే వారికి పండగే.. అమెజాన్‌లో అదిరిపోయే డీల్స్‌..!

EV Scooters: రోజురోజుకీ పెరుగుతోన్న ఇంధన ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం రాయితీలు అందించడం, ఇక భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌దే అనే వార్తల నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ కామర్స్‌ సంస్థల్లోనూ ఈవీలను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఇలాంటి కొన్ని బెస్ట్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* రూ. 50 వేలలోపు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్లాన్‌ చేస్తున్న వారికి ఈఓఎక్స్ కంపెనీకి చెందిన ఈ-2 4జీ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. వాటర్‌ ప్రూఫ్‌ బీఎల్‌డీసీ మోటార్‌తో తయారు చేసిన ఈ స్కూటర్‌ ధర రూ. 47,998గా ఉంది. ఈ స్కూటీ నడపడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్‌ అసవరం ఉండదు. డిజిటల్ డిస్‌ప్లే, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ట్యూబ్‌లెస్ టైర్లు, వెనుక డిస్క్ బ్రేక్, ముందు డిస్క్ బ్రేక్‌లు ఈ స్కూటీ సొంతం.

* రూ. 50వేలలో అందుబాటులో ఉన్న మరో స్కూటర్‌.. ఈఓఎక్స్ ఈ2. అమెజాన్‌లో ఈ స్కూటర్‌ రూ.51,498కి లభిస్తోంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 60 నుంచి 80 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్ట్, హై రిజుల్యూషన్ డిస్‌ప్లే ఈ స్కూటర్ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.

* ఇక ఏఎంఓ కంపెనీకి చెందిన జాంటీ ఎల్‌ లీడ్‌ స్కూటర్‌ రూ. 54,077కి లభిస్తోంది. ఇందులో యాంటీ-థెఫ్ట్ అలారంను అందించారు. స్కూటర్‌లో బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అంతే కాదు లైట్ వెయిట్‌తో ఉండడంతో ఈ స్కూటీని నడపడం కూడా చాలా సులభం.

* ఏంఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ జాంటీ అమెజాన్‌లో రూ. 74,691కి అందుబాటులో ఉంది. ఇందులో లిథియం బ్యాటరీని అందించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పోర్టబుల్ ఛార్జర్‌తో పాటు స్టైలిష్ ఎల్ఈడీ లైటర్లను అందించారు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌ కావడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది.

* ఇక అమెజాన్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ ఈవీ స్కూటర్‌ ఆంపియర్ కంపెనీకి చెందిన ఈవీ స్కూటర్ ఈఎక్స్ గెలాక్టిక్. దీని ధర రూ. 74,999గా ఉంది. మూడు సంవత్సరాల వారంటీతో వచ్చే ఈ స్కూటర్‌లో యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు స్టాండ్ సెన్సార్‌ను అందించారు.

Tags:    

Similar News