శ్రావణ మాసం రాశిఫలాలు: శ్రావణ మాసంలో ఈ రాశుల వారికి శుభ యోగాలే..!

శ్రావణ మాసం అత్యంత శుభప్రదమైనది. ఈ మాసంలో పూజలు, పరిహారాలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. అయితే ఈసారి జులై 26 నుంచి శుక్రుడు మిథున రాశిలో గురువుతో నెలరోజులు కలిసుండడం వల్ల కొన్ని రాశుల వారికి సవాళ్లు ఎదురుకానున్నాయి.

Update: 2025-07-24 16:18 GMT

శ్రావణ మాసం రాశిఫలాలు: శ్రావణ మాసంలో ఈ రాశుల వారికి శుభ యోగాలే..!

శ్రావణ మాసం అత్యంత శుభప్రదమైనది. ఈ మాసంలో పూజలు, పరిహారాలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. అయితే ఈసారి జులై 26 నుంచి శుక్రుడు మిథున రాశిలో గురువుతో నెలరోజులు కలిసుండడం వల్ల కొన్ని రాశుల వారికి సవాళ్లు ఎదురుకానున్నాయి. మేషం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఈ కాలంలో శుభ ఫలితాలు సులభంగా రాకపోవచ్చు. కానీ, సూచించిన పరిహారాలు చేస్తే అదృష్టం మెరుగుపడే అవకాశం ఉంది.

మేషం (Aries)

ప్రభావం: తృతీయ స్థానంలో గురు, శుక్ర సంచారం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గడం, అనారోగ్యం, ఆదాయం తగ్గడం వంటి సమస్యలు రావచ్చు.

పరిహారం: దుర్గామాతకు పూజ చేయడం లేదా లలితా సహస్రనామ స్తోత్రం పఠనం వల్ల సమస్యలు తగ్గి కోరికలు నెరవేరతాయి.

కర్కాటకం (Cancer)

ప్రభావం: వ్యయ స్థానంలో గురు, శుక్ర సంచారం వల్ల ఖర్చులు, అనారోగ్యం, మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది.

పరిహారం: శివార్చన చేయడం, దుర్గాదేవిని పూజించడం ద్వారా వృత్తి, కుటుంబ సుఖం పెరుగుతుంది; పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.

వృశ్చికం (Scorpio)

ప్రభావం: అష్టమ స్థానంలో గురు, శుక్ర సంచారం వల్ల ధన నష్టం, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, కుటుంబ సమస్యలు రావచ్చు.

పరిహారం: ఆదిత్య హృదయం తరచూ చదవడం ద్వారా ధన యోగాలు కలుగుతాయి.

మకరం (Capricorn)

ప్రభావం: షష్ట స్థానంలో గురు, శుక్ర సంచారం వల్ల ఆర్థిక సమస్యలు, పోటీదార్ల ఇబ్బందులు, ఉద్యోగంలో ప్రాభవం తగ్గే అవకాశం ఉంది.

పరిహారం: శివార్చన లేదా గణపతి పూజ చేయడం వల్ల ఆదాయం పెరిగి సమస్యలు పరిష్కారమవుతాయి.

మీనం (Pisces)

ప్రభావం: చతుర్థ స్థానంలో గురు, శుక్ర కలిసుండడం వల్ల కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది.

పరిహారం: పార్వతీ పరమేశ్వరులను తరచూ స్తుతించడం వల్ల ఆదాయం పెరిగి, మానసిక శాంతి లభిస్తుంది.

ఈ శ్రావణ మాసం సవాళ్లతో కూడినదే అయినప్పటికీ, సూచించిన పూజలు, పరిహారాలు చేస్తే ఈ రాశులవారికి శుభఫలితాలు లభిస్తాయి.

Tags:    

Similar News