శని – కుజుల వైరం.. ఈ రాశులకు ధన యోగం, ఐశ్వర్యం!

ఈ నెల జూలై 28 నుంచి కుజుడు కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. సెప్టెంబర్ 14 వరకు ఆ రాశిలోనే సంచారం చేస్తాడు. కుజుడి ఈ సంచారం వల్ల మీన రాశిలో ఉన్న శనీశ్వరుడితో సమ సప్తక దృష్టి ఏర్పడనుంది.

Update: 2025-07-22 14:24 GMT

శని – కుజుల వైరం.. ఈ రాశులకు ధన యోగం, ఐశ్వర్యం!

ఈ నెల జూలై 28 నుంచి కుజుడు కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. సెప్టెంబర్ 14 వరకు ఆ రాశిలోనే సంచారం చేస్తాడు. కుజుడి ఈ సంచారం వల్ల మీన రాశిలో ఉన్న శనీశ్వరుడితో సమ సప్తక దృష్టి ఏర్పడనుంది. శని, కుజులు పాపగ్రహాలే కాకుండా బద్ధశత్రువులు కావడంతో వీరి పరస్పర దృష్టి సాధారణంగా ధన, అధికార కాంక్షలను పెంచుతుంది. ముఖ్యంగా వృషభం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఊహించని ధన యోగం, ఐశ్వర్యం ప్రసాదించే అవకాశముంది.

వృషభం

లాభస్థానంలో ఉన్న శని, పంచమంలో ఉన్న కుజుడు పరస్పర దృష్టితో ఆదాయం పెంపు అవకాశాలు బాగా పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో లాభాలు ఉంటాయి. రావలసిన డబ్బులు అందుతాయి. కోర్టు కేసులు, ఆస్తి వివాదాల పరిష్కారం దిశగా అడుగులు పడతాయి. సొంతింటి కల నెరవేరే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కర్కాటకం

భాగ్యస్థానంలో శని, తృతీయస్థానంలో కుజుడు పరస్పర దృష్టితో ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా ఆశించిన దానికంటే ఎక్కువ లాభం పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. బాకీలు వసూలవుతాయి. విలువైన ఆస్తులు చేతికి వస్తాయి. లాభదాయకమైన పరిచయాలు పెరుగుతాయి.

వృశ్చికం

లాభస్థానంలో రాశ్యాధిపతి కుజుడు, పంచమంలో శని పరస్పర దృష్టి వల్ల వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లపై పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సంతాన యోగం కలుగుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది.

మకరం

తృతీయస్థానంలో రాశ్యాధిపతి శని, భాగ్యస్థానంలో కుజుడు సమ సప్తక దృష్టితో విదేశీ అవకాశాలు విస్తృతమవుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు లభిస్తాయి. విదేశీ సంబంధాలతో పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. చిన్న ప్రయత్నాలతోనే ఆదాయ వృద్ధి సాధ్యమవుతుంది. ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మీనం

రాశిలో శని, కన్య రాశిలో కుజుడు పరస్పర దృష్టితో ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి రీత్యా విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

Tags:    

Similar News