Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (4/3/2025)
Daily Horoscope Today In Telugu, March 4, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today
Daily Horoscope Today In Telugu, March 4, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం
తిధి: పంచమి మధ్యాహ్నం గం.3.16 ని.ల వరకు
నక్షత్రం: భరణి అర్ధరాత్రి దాటాక, తె.వా. గం.2.37 ని.ల వరకు
అమృతఘడియలు: రాత్రి గం.10.12 ని.ల నుంచి గం.11.40 ని.ల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం గం.1.21 ని.ల నుంచి గం.2.49 ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.8.55 ని.ల నుంచి గం.9.42 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.15 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.03 ని.ల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం గం.3.00 ని.ల నుంచి గం.4.30 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం. 6.32 ని.లకు
సూర్యాస్తమయం: సా. గం. 6.23 ని.లకు
మేషం
ముఖ్యుల సహకారం లభిస్తుంది. పనులూ విజయవంతం అవుతాయి. పరిస్థితులు మెరుగుపడతాయి. కీలక వ్యవహారంలో అదృష్టం తోడుంటుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
వృషభం
తొందరపాటు నిర్ణయాల వల్ల చిక్కుల్లో పడతారు. కోర్టు వ్యవహారాలను ఆషామాషీగా తీసుకోకండి. వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. వేళకు భోజనముండదు.
మిథునం
కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. కొత్త పరిచయాల లాభసాటిగా ఉంటాయి. సంతాన ద్వారా ఆనందాన్ని పొందుతారు. విందుకు హాజరవుతారు. మనశ్శాంతి లభిస్తుంది.
కర్కాటకం
అభీష్టం నెరవేరుతుంది. ప్రయత్నించిన ప్రతి పనీ సఫలం అవుతుంది. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. వృత్తిపర నైపుణ్యంతో ప్రశంసలను పొందుతారు. బంధువలతో వినోదంగా గడుపుతారు. మనశ్శాంతి ఉంటుంది.
సింహం
కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకండి. సంతానం తీరును విబేదిస్తారు. బుద్ధి నిలకడగా ఉండదు. అనవసర కలహాలకు ఆస్కారం ఉంది. భవిష్యత్తు గురించిన బెంగ ఏర్పడుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన ఉంది.
కన్య
లక్ష్య సాధనలో అడ్డంకులు ఎదురవుతాయి. అప్రమత్తంగా లేని కారణంగా పెద్ద తప్పు జరిగే అవకాశం ఉంది. చెడు ఆలోచనలను అదుపు చేయాలి. పోటీల్లో పాల్గొనకండి. శత్రుపీడ పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త.
తుల
సుఖంగా గడుపుతారు. వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి. ఆర్థిక లబ్దిని పొందుతారు. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు.
వృశ్చికం
అడ్డంకులను తేలిగ్గా దాటేసి కార్యాలను సఫలం చేసుకుంటారు. మిత్రులు అండగా నిలుస్తారు. ధనలాభముంది. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం బాగుటుంది. అపార్థాలు తొలగిపోతాయి. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
ధనుస్సు
కార్యసాధనలో ఆటంకాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి. సంతానం తీరు ఆవేదనకు కారణమవుతుంది. అనుమానాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారం వికటిస్తుంది. అనవసర విరోధం వస్తుంది.
మకరం
పనిలో అడ్డంకులు పెరుగుతాయి. ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచాలి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. తల్లి వైపు బంధువుల గురించిన వర్తమానం అందుతుంది. ఒత్తిడి పెరుగుతుంది.
కుంభం
కీలక సమాచారం అందుతుంది. వృత్తిపరమైన నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యవహారాలన్నీ సవ్యంగా సాగుతాయి. తోబుట్టువుల సమస్యను పరిష్కరిస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.
మీనం
భావాన్ని స్పష్టంగా చెప్పని కారణంగా సమస్యలొస్తాయి. బ్యాంకు లావాదేవీలు చికాకు పరుస్తాయి. నిందలు ఎదురవుతాయి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. ఇతరుల వల్ల ఇబ్బంది పడతారు. ఆస్తినష్టం ఉంది.