Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (3/3/2025)
Daily Horoscope Today In Telugu, March 3, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.
Daily Horoscope Today
Daily Horoscope Today In Telugu, March 3, 2025
నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం
తిధి: చవితి సాయంత్రం గం.6.02 ని.ల వరకు ఆ తర్వాత పంచమి
నక్షత్రం: రేవతి ఉదయం గం.6.39 ని.ల వరకు ఆ తర్వాత అశ్వని రేపు తె.వా.4.29 ని.ల వరకు
అమృతఘడియలు: రాత్రి గం.9.56 ని.ల నుంచి గం.11.24 ని.ల వరకు
వర్జ్యం: అర్ధరాత్రి దాటాక గం. 12.51 ని.ల నుంచి గం.2.18 ని.ల వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం గం.12.51 ని.ల నుంచి గం.1.39 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.14 ని.ల నుంచి గం.4.01 ని.ల వరకు
రాహుకాలం: ఉదయం గం.7.30 ని.ల నుంచి గం.9.00 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం. 6.33 ని.లకు
సూర్యాస్తమయం: సా. గం. 6.23 ని.లకు
మేషం
ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయానికి మించిన ఖర్చుంటుంది. అనవసర జోక్యాలు వద్దు. ప్రయాణాన్ని వాయిదా వేయడం మంచిది. నిద్రలేమి వేధిస్తుంది. కోర్టు వ్యవహరాల్లో నిర్లక్ష్యం తగదు.
వృషభం
వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన వారితో విందుకు వెళతారు. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. అభీష్టం నెరవేరుతుంది.
మిథునం
ఇష్టకార్యం అనుకూలిస్తుంది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగ విజయం ఉంది. అధికార వృద్ధి గోచరిస్తోంది. అవకాశాలు చేజార్చుకోకండి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కర్కాటకం
ఆటంకాలను తేలిగ్గా దాటేస్తారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలించవు. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బాధ్యతల నిర్వహణలో జాగ్రత్త. సంతానం తీరు బాధిస్తుంది.
సింహం
నిర్దేశిత లక్ష్యాలు నెరవేరవు. ఇతరులపై చెడు అభిప్రాయం ఏర్పడతుంది. స్వల్ప తగాదాలకు ఆస్కారముంది. పోటీల్లో పాల్గొనకండి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థుల బెడద పెరుగుతుంది.
కన్య
ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆర్థిక విషయాలు తృప్తినిస్తాయి. విందుకు హాజరవుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం పెరుగుతుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ప్రయాణం లాభసాటిగా ఉంటుంది.
తుల
శుభ ఫలితాలుంటాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక లబ్దిని పొందుతారు. మానసిక చింత తొలగిపోతుంది. అదృస్టం వరిస్తుంది. శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. విందులో పాల్గొంటారు.
వృశ్చికం
బద్ధకాన్ని వదిలి కష్టపడాలి. ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతాయి. తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. నిరాశపడకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ప్రేమ వ్యవహారాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి.
ధనుస్సు
పనుల్లో విపరీతమైన జాప్యం సూచిస్తోంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. బుద్ధి నిలకడగా ఉండదు. ఆత్మీయులతో విరోధం ఏర్పడుతుంది. స్థిరాస్తి, విద్య, సేవా రంగాల్లోని వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
మకరం
వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ధైర్యసాహసాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కీలక సమాచారం అందుతుంది. ఆత్మవిశ్వాసం, స్థిరత్వం పెరుగుతాయి.
కుంభం
బ్యాంకు లావాదేవీల్లో చికాకులుంటాయి. మాట తప్పిన కారణంగా అవమానం తప్పదు. వేళకు భోజనం ఉండదు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ చూపాలి. ఖర్చు తగ్గించాలి. కంటికి సంబంధించిన ఇబ్బంది వస్తుంది.
మీనం
పనులు చకచకా పూర్తవుతాయి. ధనలాభం ఉంది. అదృష్టం వరిస్తుంది. వాహనయోగం ఉంది. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. గౌరవం లభిస్తుంది. చిన్న నాటి స్నేహితులతో వినోదాల్లో పాల్గొంటారు.