August Planets Transit: ఆగస్టులో గ్రహాల సంచారం.. ఐదు రాశుల వారికి అదృష్ట కాలం!
ఆగస్టు 2025లో గ్రహాల సంచారంలో అనేక ముఖ్యమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా బుధుడు, సూర్యుడు, శుక్రుడు, శని, అంగారకుడు తమ తమ రాశులను మార్చడం వల్ల పలు రాశులపై ప్రభావం పడనుంది.
August Planets Transit: ఆగస్టులో గ్రహాల సంచారం.. ఐదు రాశుల వారికి అదృష్ట కాలం!
ఆగస్టు 2025లో గ్రహాల సంచారంలో అనేక ముఖ్యమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా బుధుడు, సూర్యుడు, శుక్రుడు, శని, అంగారకుడు తమ తమ రాశులను మార్చడం వల్ల పలు రాశులపై ప్రభావం పడనుంది. ఈ మార్పులు ఆరోగ్యం, ధనం, కెరీర్, కుటుంబ జీవితం వంటి అనేక విషయాలలో సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ నెల 9న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి, ఆగస్టు 11 నుంచి ప్రత్యక్షంగా మారుతాడు. ఆ తర్వాత 30న సింహరాశిలోకి చేరతాడు. ఇక సూర్యుడు ఆగస్టు 17న తన స్వరాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు కూడా ఈ నెల 21న కర్కాటక రాశిలోకి అడుగుపెడతాడు. శని మీన రాశిలో తిరోగమనంలో ఉంటూ, కుజుడు కన్యా రాశిలో కొనసాగుతాడు. ఈ గ్రహాల మార్పులు ఐదు రాశులపై ప్రత్యేక ప్రభావం చూపిస్తాయి.
మేషరాశివారికి ఈ గ్రహ సంచారాలు ఎంతో అనుకూలంగా మారబోతున్నాయి. డబ్బుతో సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఇల్లు, వాహనం కొనాలనే కోరిక నెరవేరే అవకాశాలున్నాయి. కుటుంబంలో శాంతి, సంతోష వాతావరణం నెలకొంటుంది. ఆస్తి వ్యవహారాల్లో లాభం కలుగుతుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి, కెరీర్ అభివృద్ధికి ఇది మంచి సమయం.
మిథునరాశివారికి ఆగస్టు నెల ఫైనాన్షియల్‌గా మంచి అనుభవాలను ఇస్తుంది. గతంలో నిలిచిపోయిన డబ్బులు ఇప్పుడు లభించే అవకాశం ఉంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రయాణాల ద్వారా మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ చేసేందుకు అవకాశం ఉండగా, విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారిస్తారు. ప్రసంగం లేదా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి ఇదొక బంగారు అవకాశం అవుతుంది.
కన్యారాశివారికి ఆర్థికంగా ఇది శ్రేయస్సు తీసుకొచ్చే సమయం. నిలిచిపోయిన డబ్బులు లభించడంతో కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతమవుతాయి. ఇంటి కొనుగోలు వంటి అభిలాషలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభవాతావరణం నెలకొంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగాల్లో ఉన్నవారు తమ పనితీరు ద్వారా అందరి మనసు గెలుచుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
తుల రాశివారు ఈ నెలలో ఆర్థికంగా ముందడుగు వేస్తారు. బ్యాంకు బ్యాలెన్స్ మెరుగవుతుంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే సమయం వస్తుంది. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. వ్యాపారంలో లాభాలు రావడం ద్వారా సామాజికంగా ఖ్యాతి పెరుగుతుంది. వీరు చేపట్టిన పనులన్నీ విజయవంతం కావచ్చు.
కుంభరాశి వారికి ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. వివాదాల నుంచి బయటపడతారు. జీవితం ప్రశాంతంగా మారుతుంది. ఆదాయం, సంపద పెరుగుతుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు అనుకూల సమయం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పిల్లలు, స్నేహితులకు సంబంధించిన విషయాల్లో సంతోషకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. అన్ని అడ్డంకులను అధిగమిస్తూ విజయపథంలో నడుస్తారు.
ఈ వివరాలు పండితుల అభిప్రాయాల ఆధారంగాOnly చదువరుల ఆసక్తికోసం అందించబడినవే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించాలి.