Aries Horoscope 2026: 2026లో మేష రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం.. కష్టాల నుంచి గట్టెక్కే మార్గాలు ఇవే!
Aries Horoscope 2026: నూతన సంవత్సరం 2026 మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు.
Aries Horoscope 2026: 2026లో మేష రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం.. కష్టాల నుంచి గట్టెక్కే మార్గాలు ఇవే!
Aries Horoscope 2026: నూతన సంవత్సరం 2026 మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. ఏడాది మొదటి భాగంలో గ్రహస్థితులు కొంత ఒత్తిడిని కలిగించినా, రెండో భాగంలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఈ రాశి వారికి 2026లో ఏలినాటి శని తొలి దశ ప్రారంభం కానుండటంతో కొన్ని ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మేష రాశి వారు ప్రతికూలతలను తగ్గించుకోవాలంటే పాటించాల్సిన విషయాలు, చేయాల్సిన పూజలు, పఠించాల్సిన మంత్రాలపై ప్రత్యేక కథనం…
2026లో మేష రాశికి ఎదురయ్యే ప్రతికూల అంశాలు
శని దేవుడు 12వ స్థానంలో సంచారం చేయనున్న నేపథ్యంలో మానసిక ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం భావన పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికమై ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా నిద్రలేమి, కంటి సమస్యలు, చిన్నపాటి అనారోగ్యాలు ఇబ్బంది పెట్టవచ్చు. ప్రారంభించిన పనులు ఆలస్యం కావడం వల్ల అసహనం పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మేష రాశి వారు పాటించాల్సిన పరిహారాలు
♦ ప్రతి శనివారం శని దేవాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.
♦ నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు దానం చేయడం శుభప్రదం.
♦ పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు సహాయం చేయాలి.
♦ వస్త్ర దానం, అన్నదానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది.
♦ కోపాన్ని నియంత్రించుకుని, పెద్దల మాట గౌరవించడం మేలు చేస్తుంది.
పఠించాల్సిన మంత్రాలు
♦ శని గాయత్రీ మంత్రం:
ఓం శనైశ్చరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్
♦ ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించాలి.
♦ మహామృత్యుంజయ మంత్రం జపం ఆరోగ్య రక్షణ ఇస్తుంది.
♦ రుణ విమోచన అంగారక స్తోత్రం పఠిస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.
చేయాల్సిన పూజలు
♦ సోమవారం శివుడికి రుద్రాభిషేకం చేయడం శుభప్రదం.
♦ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం లేదా అర్చన చేయాలి.
♦ నెలకు ఒక్కసారి అయినా శని క్షేత్రంలో తైలాభిషేకం చేయడం మేలు చేస్తుంది.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడింది. ఇవి శాస్త్రీయంగా నిర్ధారించబడినవి కావు. కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడింది. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది పాఠకుల వ్యక్తిగత నిర్ణయం.