ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధరపై జగన్ సర్కార్ వివరణ

కరోనా వైరస్ పై పోరుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన ర్యాపిడ్ కిట్ల ధరల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.

Update: 2020-04-20 03:12 GMT
Andhra pradesh YS Jagan received rapid testing kits

కరోనా వైరస్ పై పోరుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన ర్యాపిడ్ కిట్ల ధరల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఒక్కొక్కటి రూ.337 చొప్పున కొనుగోలు చేసింది. అయితే, జగన్ సర్కార్ ఒక్కో కిట్‌కు రూ.730 చెల్లించిందని ప్రచారం నడుస్తుంది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపట్టారు.

ప్రభుత్వం 2 లక్షల కరోనా టెస్ట్ కిట్లను కొనుగోలు చేయగా.. అందుకు రూ.14.60 కోట్ల ఖర్చు అయ్యింది. ఓ రకంగా చూస్తే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చెల్లించిన ధర కంటే రెట్టింపు ధరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించింది. అయితే, మొత్తం ఏనిమిది లక్షల కిట్లను ప్రభుత్వం ఆర్డర్ చేసినట్లు తెలిసింది. అందులో 25 శాతం ధర రూ.14.60 కోట్లు. అందులో తొలిదశలో లక్ష కిట్లు డెలివరీ అయ్యాయి. మిగిలిన డబ్బులు కిట్లు మొత్తం విజయవాడకు డెలివరీ అయిన తర్వాత చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే, ఈ ధరలపై ప్రభుత్వం విమర్శలు తలెత్తుతున్న విషయం తెలిసిందే.

దీంతో.. జగన్ సర్కార్ వివరణ ఇచ్చింది. కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే తక్కువ రేటుకు కొన్నదో.. ఆ రేటు ప్రకారమే తాము కూడా చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్ తక్కువ రేటుకే కొన్నదని, ఆ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన మొత్తానికే ర్యాపిడ్ టెస్ట్ కిట్లకు డబ్బు చెల్లిస్తామని ఆ ప్రకటనలో తెలిపింది. 

Tags:    

Similar News