విశాఖలో పెట్రోల్ దాడికి యత్నం... తృటిలో తప్పిన ప్రమాదం

Update: 2020-03-07 11:25 GMT

విశాఖపట్టణం జీవీఎంసీ 6వ జోన్ లో ఇద్దరు మహిళా ఉద్యోగినుల మధ్య దాడి ఉద్రిక్తతకు దారి తీసింది. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్‌పై ఓ ఔట్ సోర్స్ సూపర్ వైజర్ పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించింది. పక్కనే ఉన్న సహోద్యోగులు వెంటనే స్పందించి, అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో వెంటనే మాట మార్చిన ఔట్ సోర్స్ సూపర్ వైజర్ అన్నామణి తానూ ఆత్మహత్య చేసుకునేందుకు పెట్రోల్ తెచ్చుకున్నట్టు తెలిపింది. అయితే, తనపై దాడి చేసేందుకే ఆమె వచ్చిందని మెడికల్ ఆఫీసర్ ఆరోపించారు. 

Tags:    

Similar News