హాట్స్ ఆఫ్ మేడం : 22 రోజుల బిడ్డను వదిలేసి విధులకు..

కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే..

Update: 2020-03-31 06:22 GMT
GVMC Commissioner Srijana

కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. లాక్ డౌన్ లో భాగంగా అధికారులు పోలీసులు వైద్యులు తమ విధుల్లో పాల్గొంటూ కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక గత మూడు వారాల కింద మగ బిడ్డకి జన్మనిచ్చిన జీవీఎంసీ కమిషనర్ సృజన కూడా విధుల్లో పాల్గొంటూ అందరి చేత శభాష్ అనిపించుకుంది.

గత మూడు వారాల కింద మగ బిడ్డకి జన్మనిచ్చిన ఆమె ఆ పసికందు ఆలనాపాలనా కూడా పక్కనపెట్టి విధుల్లో చేరారు. పిల్లవాడి బాగోగుల్ని భర్త, తల్లికి వదిలేశారు. ఆమె మద్య, మధ్యలో బిడ్డను చూడటానికి వెళ్లొస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన నింపే బాధ్యత తనపైన ఉందని, అందుకే కష్టమైన సమయంలో కూడా విధుల్లోకి హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు.

ఇక లాక్ డౌన్ నిబంధనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించిన సూచనలను తప్పకుండా పాటించాలని, అవసరం వస్తే గుంపులు గుంపులుగా కాకుండా ఇంట్లో నుంచి ఒక్కరే బయిటకు రావాలని కోరారు.. ఇక బయటికొచ్చినప్పుడు సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ప్రజలకు నిత్యావసరాల కొరత రానివ్వమని.. కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ఇక జీవీఎంసీ ఆధ్వర్యంలో నిరాశ్రయుల కోసం 8 షెల్టర్లు ఏర్పాటు చేశామని.. మరో 600 మందికి పునరావాసం కల్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

ఇక కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి వైరస్ 195 దేశాలకి పైగా వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా ఏడూ లక్షల మందిని బలితీసుకుంది. ఇక భారత్ లో 1200 కేసులు నమోదు కాగా 35 మంది మృతి చెందారు. ఇక ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 23 కి చేరింది. 

Tags:    

Similar News