Andhrapradesh: ఏపీలో వినియోగదారులకు షాక్.. విజయ పాల ధర పెంపు

Update: 2020-01-10 07:38 GMT

ఏపీలో నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ జనానికి మరో షాక్ తగిలింది. పాడి రైతుల నుంచి పాలసేకరణ ధరలు పెరిగిన నేపథ్యంలో పాల సరఫరా ధరలను కూడా పెంచాలని కృష్ణామిల్క్‌ యూనియన్‌ (విజయాడెయిరీ) నిర్ణయం తీసుకుంది. పాల ధరను పెంచుతూ పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్టు విజయాడెయిరీ పేర్కొంది. దీంతో పాల వినియోగదారులపై మరోసారి భారం పడినట్లయింది. వాస్తవానికి విజయ పాల ధరను నాలుగు నెలల క్రితమే మూడు కేటగిరీల్లో రెండు రూపాయల మేర పెంచింది.

అయితే ఇది చేసినా కూడా కంపెనీకి నష్టం వాటిల్లుతోందని.. తాజాగా మరో మూడు కేటగిరీల్లో ధరలను పెంచింది. అందులో భాగంగా విజయ గోల్డ్ పాల ధర నిన్నటివరకు లీటరుకు రూ. 56 ఉండగా, ఇప్పుడు దానిని రూ.60కి పెంచింది. అలాగే విజయ ప్రీమియం (స్టాండర్డ్), విజయ స్పెషల్ (ఫుల్ క్రీం), విజయ గోల్డ్ పాల ధరలను కూడా పెంచింది. విజయ ప్రీమియం లీటర్ పాలపై రూ. 2 పెంచి రూ.52 చేసింది, ఫుల్ క్రీం పాల ధరను రూ.4 పెంచి రూ.58 కి పెంచి అమ్ముతోంది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్టు విజయ డెయిరీ యూనియన్ ప్రకటించింది. అంతేకాదు ప్రైవేటు డెయిరీల పాల ధరలతో పోలిస్తే మార్కెట్‌లో విజయ పాల ధరలే తక్కువగా ఉన్నాయని విజయా డైరీ అధికారులు చెబుతున్నారు. 

Tags:    

Similar News