కరోనా ఎఫెక్ట్‌ : టీటీడీ కీలక నిర్ణయం

Update: 2020-03-14 12:06 GMT

కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు క్యూ లైన్లో నిల్చోకుండా చర్యలు చేపడుతున్నారు. గంటకు నాలుగు వేల మంది భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించనున్నారు. సహస్ర్త కళాషాభిషేకం, వసంతోత్సవం, విశేష పూజలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

మార్చి 19 నంచి 21 వరకు శ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహా యాగం నిర్వహించున్నారు. శారద పిఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ, మంత్రాలయ పిఠాధిపతి సుబుదేంద్ర స్వామిజిల ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమలలో 15 సెక్టార్స్ గా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. గదులు ఖాళీ చేసిన వెంటే తిరిగి అలాట్ చేయకుండా గంట తరువాత అలాట్ చేసే విధంగా నిర్ణయించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో మార్పులు చేశారు. ఒంటిమిట్ట ఆలయంలోపల సీతారాముల కల్యాణం జరుపాలని నిర్ణయించారు.  

Tags:    

Similar News