Kurnool: విద్యార్థినుల హాస్టల్ గేట్ కు తాళం వేసిన యాజమాని

హాస్టల్ అద్దె ఇవ్వకపోవడంతో విద్యార్థినులను భవన యాజమాని నిర్బంధించారు.

Update: 2020-03-18 07:15 GMT

హాస్టల్ అద్దె ఇవ్వకపోవడంతో విద్యార్థినులను భవన యాజమాని నిర్బంధించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో 150 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరిలో కొందరని బీసీ హాస్టల్ లో వుంచగా, మిగిలిన కొందరిని అద్దె భవనంలో అధికారులు నివాసవసతి కల్పించారు. గత ఆరు నెలలుగా భవనం అద్దె చెల్లించడంలేదు. మరోవైపు అద్దె భవనంలో తగిన వసతి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థినులు మరో భవనంలోకి మారే ప్రయత్నాల్లో ఉన్నారు.  

విద్యార్థినులు మరో భవనంలోకి మారుతున్నారు అనే విషయం తెలుసుకుని యాజమాని వచ్చారు. బాకీపడ్డ కిరాయి ఇవ్వకుండా ఎలా ఖాళీ చేస్తారని వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థినులు లోపల వుండగానే గేటుకు యాజమాని తాళం వేశారు. దీంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం పోలీసులకు చేరింది. అద్దె డబ్బులపై అధికారులతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. దీంతో హాస్టల్ గేటుకు యాజమాని తాళం తీసివేశారు.


Full View


Tags:    

Similar News