ఏపీలో 11 జిల్లాలు.. జగన్ సర్కార్ తప్పుడు లెక్కలు చంద్రబాబు ఫైర్

జగన్ సర్కార్ పై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు.

Update: 2020-04-21 12:56 GMT
Chandrababu Naidu (File photo)

జగన్ సర్కార్ పై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ప్రపంచమంతా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటే..రాష్ట ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని, 11 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయని ప్రభుత్వం వివరాలు గోప్యంగా ఉంచడం తప్పని ముందు నుంచీ తాను చెబుతున్నానని చంద్రబాబు తెలిపారు.

నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తాము సలహాలు ఇస్తున్నామని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. జగన్ సర్కార్ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజల ప్రాణాలు పణంగా పెడుతోందని చంద్రబాబు విమర్శించారు. ప్రజలు కరోనాతో భయపడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారుజగన్ సర్కార్ పై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. 

కరోనా రాపిడ్ టెస్టింగ్‌ కిట్లపై కూడా వైసీపీ నేతలు కక్కుర్తి పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. దక్షిణ కొరియా నుంచి ఎక్కువ ధరకు టేస్ట్‌ కిట్లను తెప్పించుకున్నారని, పట్టుబడిన తర్వాత ధర తగ్గించుకుంటామని చెబుతున్నారని చంద్రబాబు విమర్శించారు. కరోనాపై పోరులో కేరళ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందన్నారు. ప్రజలకు నిత్యావసర సరుకులను కేరళ మాదిరిగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో విజయసాయిరెడ్డి రాష్ట్రమంతా తిరుగుతున్నారని ఆయనకు అనుమతులు ఎవరూ ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. హాట్‌స్పాట్లలో వైసీపీ నేతలు పర్యటించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. రోజాపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్యేపై పూల వర్షం కురిపించుకున్నరని విమర్శలు గుప్పించారు.


Tags:    

Similar News