ఆ వాయిస్ నాది కాదు: ఆడియో టేప్ పై పృథ్వీ వివరణ

సినీనటుడు, ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పృథ్వీ ఆడియో టేప్ కలకలం రేపుతోంది.

Update: 2020-01-12 06:11 GMT

సినీనటుడు, ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పృథ్వీ ఆడియో టేప్ కలకలం రేపుతోంది. ఎస్వీబీసీలో పనిచేసే మహిళా ఉద్యోగినితో జరిపిన ఫోన్ సంబాషణపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ వీడియో టేప్ వైరల్ గా మారింది. దీంతో ఆడియో టేపుల సంబాషణపై ఎస్వీబీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు. మహిళా ఉద్యోగి పట్ల ఇలా ప్రవర్తించడం దారుణమని అంటున్నారు. పృథ్విని ఉన్నపలంగా ఎస్వీబీసీ ఛానల్ పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాదు మొదట్లో పృథ్వీ పరమ భక్తుడిగా ఉన్నారని.. ఆ తరువాత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పద్మావతి అథిగృహంలోనే పృథ్వీ మద్యం సేవించే వారని వారు ఆరోపిస్తున్నారు. కేవలం మహిళల జీతాలే పెంచేవారని.. ఎస్వీబీసీ చైర్మన్ గా ఒక కామాంధుడిని నియమించారని ఎస్వీబీసీ ఉద్యోగులు విమర్శిస్తున్నారు.

అయితే ఆ ఆడియో టేప్ పై స్పందించారు పృథ్వీ.. ఆ ఆడియో టేప్ లో ఉన్న వాయిస్ తనది కాదని కొట్టిపారేశారు. ఆ మహిళా ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. ఉద్యోగుల భద్రత కోసం తాను సేవ చేశానని అన్న పృథ్వీ.. ఎస్వీబీసీ ఉద్యోగులు తనను తప్పుగా అర్ధం చేసుకున్నారని అన్నారు. మహిళలు అంటే తనకు గౌరవం అన్న పృథ్వీ.. తిరుమలలో మహిళలతో మాట్లాడే సమయంలో కూడా తాను రెండు కెమెరాలు పెట్టుకొని మాట్లాడతానని అన్నారు. ఇలాంటి ఆరోపణలు వస్తాయని తనకు ముందే తెలుసని అన్నారు. దీనిపై విచారణకు కూడా సిద్ధమని వెల్లడించారు. 


Full View


Tags:    

Similar News