నిరుద్యోగులకు జగన్ గుడ్ న్యూస్..టెట్, డీఎస్సీలకు వేరు వేరు నోటిఫికేషన్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేసిన విషయం తెలిసిందే.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ సూచనల మేరకు రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం జనవరి నెలలో టెట్, డీఎస్సీలకు వేరువేరుగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.
అధికారులు 12 వేల నుండి 15 వేల వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. జనవరి నెల మొదటివారంలో టెట్ పరీక్ష, జనవరి నెల చివరి వారంలో డీఎస్సీ పరీక్ష ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. టీచర్ పోస్టుల భర్తీకి ముందుగా టెట్ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు.