మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖపై సీఐడీ విచారణలో సంచలన విషయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ ప్రసాద్ ప్రత్యేక ఆర్డినెన్సు ద్వారా పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

Update: 2020-04-24 12:50 GMT
Nimmagadda ramesh kumar (File photo)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ ప్రత్యేక ఆర్డినెన్సు ద్వారా పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. అనంతరం వైసీపీకి చెందిన వారి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని కేంద్ర ప్రభుత్వానికి ఎస్ఈసీ రమేశ్ కుమార్ రాసిన ఓ లేఖ మార్చి 18న వైరల్ అయ్యింది.

అయితే కేంద్రానికి రాసిన లేఖ విషయమై సీఐడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ లేఖను బయట తయారు చేసి నిమ్మగడ్డకు పంపినట్లుగా సమాచారం. ల్యాప్‌టాప్‌లో లేఖను తయారు చేసి పెన్ డ్రైవ్ ద్వారా కంప్యూటర్‌లోకి పంపి.. వాట్సాప్ వెబ్ ద్వారా రమేశ్ కుమార్ పంపినట్టు సమాచారం. రమేశ్ కుమార్ ఫోన్ ద్వారా ఆ లేఖను కేంద్రానికి పంపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ల్యాప్‌టాప్‌లో ఫైళ్లను డిలీట్ చేసి, పెన్‌డ్రైవ్‌ను ధ్వంసం చేవారని సీఐడీ అధికారులు వెల్లడించారు. లేఖ రాసిన తర్వాత కంప్యూటర్‌ను కూడా ఫార్మాట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆధారాలను మాయం అంశంపై కేసు నమోదు చేశామని సీఐడీ డీజీ సునీల్ కుమార్ పేర్కొన్నారు.

ఇటీవలే మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ పేరుతో వెలువడ్డ లేఖ మీద విచారణ జరిపించాలని ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ ఆఫీసులో తయారైందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, ఆ పార్టీ నాయకులు వర్ల రామయ్య, టీడీ జనార్ధన్‌ల హస్తం ఉందని ఆరోపించారు. కేంద్ర హోం శాఖకు రాసిన ఫోర్జరీ సంతకాలతో లేఖలో ఉన్నాయని నకిలీ డాక్యుమెంట్లని విజయసాయి ఆరోపించారు.

Tags:    

Similar News