ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ కౌంటర్ పిటిషన్..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2020-04-19 14:41 GMT
Nimmagadda Ramesh Kumar (File Photo)

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. శనివారం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై రిప్లై పిటిషన్ వేశారు. ఈ 243 ప్రకారం ఎన్నికల కమిషనర్‌ను తొలగించే అధికారం ప్రభుత్వానికి వుందని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే ఆర్డినెన్సు గురించి చెప్పకుండా సాధారణ కౌంటర్ వేసి ఇంకోటి ఫైనల్ కౌంటర్ వేస్తామనడం సరికాదని రమేశ్ కుమార్ కోర్టుకు తెలిపారు.

243 ప్రకారం ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం తప్పని నిమ్మగడ్డ పిటిషన్‌లో ప్రస్తావించారు. ముఖ్యంగా ఓ ఎన్నికల ప్రాసెస్ అమల్లో ఉంటే ఎన్నికల కమిషనర్‌ను ఎలా మారుస్తారని నిమ్మగడ్డ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఆరోపించారు. 65 ఏళ్లలోపు ఉన్న వారినే ఎన్నికల కమిషనర్ గా నియమించాలని కొత్తగా రూల్ తీసుకొచ్చారు.. కానీ ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘించి 74 ఏళ్లు ఉన్న రిటైడ్ జడ్జ్ ని అపాయింట్ చేయడం చట్టవిరుద్దమని నిమ్మగడ్డ పిటిషన్‌లో పేర్కొన్నారు. సోమవారం నిమ్మగడ్డ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రానుంది.


Tags:    

Similar News