చోడవరంలో నికాన్ కెమెరా వెడ్డింగ్ ఫోటో గ్రఫీ వర్క్ షాప్

పట్టణంలోని సీతారామ్ ఫంక్షన్ హాల్ నందు మంగళవారం నికాన్ ఫోటో వర్క్ షాపు ఘనంగా నిర్వహించారు.

Update: 2019-12-25 04:26 GMT
నికాన్ కెమెరా వెడ్డింగ్ ఫోటో గ్రఫీ వర్క్ షాప్

చోడవరం : పట్టణంలోని సీతారామ్ ఫంక్షన్ హాల్ నందు మంగళవారం నికాన్ ఫోటో వర్క్ షాపు ఘనంగా నిర్వహించారు. విశాఖలోని గౌరీ నటరాజ్ ఫోటో స్టోర్స్ వారి సౌజన్యంతో చోడవరం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్ షాపుని నిర్వహించారు. నికాన్ ఇండియా తెలుగు రాష్ట్రాల మెంటర్ ఎస్ .కే .హుస్సేన్ , నికాన్ కెమెరాల వివిధ మోడళ్ళ పనితీరు, టెక్నికల్స్ ,మెళకువలు గురించి వివరించారు.

ఫోటో గ్రాఫర్లు అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్ గా ఎదగడానికి కావలిసన అవలంభించవలసిన పలు సూచనలు తెలియజేశారు. అనంతరం గౌరీ నటరాజ్ ఫోటో స్టోర్స్ అధినేత కిషోర్ ని , నికార్ మెంటార్ హుస్సేన్ ని, నికాన్ మేనేజర్ లోవరాజు ని అసోసియేషన్ సభ్యులు సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చోడవరం ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొంగరాల సురేష్ , వైస్ ప్రెసిడెంట్ శివ, సెక్రటరీ స్వామి మరియు ఫోటో గ్రాఫర్లు , వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News