కృపానందం మృతి నన్నుతీవ్రంగా కలచివేసింది: నారా లోకేష్

అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందేమోనన్న ఆవేదనతో మరో రైతు గుండె ఆగింది. అమరావతి ప్రాంతమైన కృష్ణాయపాలెంలో అద్దేపల్లి కృపానందం అనే రైతు గుండెపోటుతో కన్నుమూశాడు.

Update: 2020-01-08 08:30 GMT

అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందేమోనన్న ఆవేదనతో మరో రైతు గుండె ఆగింది. అమరావతి ప్రాంతమైన కృష్ణాయపాలెంలో అద్దేపల్లి కృపానందం అనే రైతు గుండెపోటుతో కన్నుమూశాడు.. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృపానందం ఇవాళ హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. రాజధాని కోసం కృపానందం తనకున్న అర ఎకరం పొలాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది.. గత కొన్ని రోజులుగా రాజధాని తరలిపోతుందేమోనని తీవ్ర ఆవేదనలో పడిపోయాడు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటు రావడంతో మంగళగిరిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో తుదిశ్వాస విడిచారు. కృపానందం మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇటు కృపానందం మృతిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ చెత్త నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారు. ప్రాణం కంటే ఎక్కువుగా ప్రేమించే భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కృపానందం మృతి తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. వైకాపా నాయకులు రైతులను అవమనిస్తూ, కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలు రైతులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నాయని విమర్శించారు. మూర్ఖంగా వ్యవహరించకుండా రాజధాని పై ప్రభుత్వం పునరాలోచించడం మంచిదని హితవు పలికారు లోకేష్. 



Tags:    

Similar News