టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మాజీ ఎంపీ మోహన్ బాబు

Update: 2019-03-03 03:20 GMT

మాజీ ఎంపీ, సినీనటుడు మోహన్ బాబు టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల చాలా కళాశాలల్లో నాణ్యమైన విద్య ఉండటం లేదని అన్నారు. 2014 నుంచి 2019 విద్యాసంవత్సరం వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకుండా ప్రభుత్వం అలసట వహిస్తోందని ఆయన మండిపడ్డారు. తన అధీనంలో నడిచే శ్రీ విద్యానికేతన్‌కు ప్రభుత్వం నుంచి సుమారు రూ.19 నుంచి 24 కోట్ల బకాయి రావాల్సి ఉందన్నారు. గతంలో అన్ని సామాజిక వర్గాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించేవారని.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంటే భిక్షం వేయడం కాదు.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. శనివారం శ్రీ విద్యానికేతన్ కాలేజీలో విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 26 సంవత్సరాలుగా 25 శాతం ఉచిత విద్యనందిస్తున్నాని చెప్పారు. గతంలో ఏడాదికి నాలుగుసార్లు విడతల వారీగా ఫీజు చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. వాటిని కూడా చెల్లించడంలో మాటతప్పిందని అన్నారు.

Similar News