అమరావతిపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతి సురక్షితం కాదన్న బొత్స శివరామకృష్ణ కమిటీ కూడా ఇదే చెప్పిందన్నారు.

Update: 2019-08-20 12:35 GMT

నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతి సురక్షితం కాదన్న బొత్స శివరామకృష్ణ కమిటీ కూడా ఇదే చెప్పిందన్నారు. ఆనాడు శివరామకృష్ణ కమిటీ చెప్పిందే ఇప్పుడు నిజమవుతోందన్నారు. వర్షాలు వస్తే అమరావతి మునిగిపోతుందన్న బొత్స ఇటీవల వచ్చిన వరదల్లో ఇది రుజువైందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మించాల్సి వస్తే డ్యాములు, కాలువలు కట్టాల్సి వస్తుందన్నారు. అమరావతిలో ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున వరద నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుందన్నారు.

రాజధాని నిర్మాణంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందన్న మంత్రి బొత్స అమరావతిలో పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో అయితే నిర్మాణ వ్యయం డబుల్ అవుతుందని, లక్షయ్యే దానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. అదే ఇతర ప్రాంతాల్లో అయితే ఖర్చు భారీగా తగ్గుతుందన్నారు. అందుకే రాజధాని నిర్మాణంపై చర్చించాల్సిన అవసరం కనిపిస్తోందన్న బొత్స త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందన్నారు. 

Tags:    

Similar News