సీఎం జగన్‌ తలచుకుంటే... ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2020-03-18 10:17 GMT
peddireddy ramachandra reddy

ఎన్నికల సంఘంపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే స్థానిక ఎన్నికలు వాయిదా వేశారని అన్నారు. తప్పుడు రిపోర్టులను ఈసీ రమేష్ కుమార్ ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి సిద్ధార్థ జైన్ తప్పుడు రిపోర్టులు ఇచ్చారని ఈసీకి బుద్దుంటే ఆ రిపోర్టులను ఎలా ఆమోదిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, రమేష్ కుమార్ ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారని వారిద్దరికీ మంచి అనుబంధం ఉందన్నారు. రమేష్‌కు ఉద్యోగంలో కూడా చంద్రబాబు సాయం చేశారని తెలిపారు.

నోటిఫికేషన్‌ కూడా ఇవ్వని మహారాష్ట్రలో వాయిదా వేశారనడంలో అర్ధం లేదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో ఏదో జరిగిపోయిందని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారన్నారు. బ్లాక్‌ క్యాట్‌ సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబు ఇంకా సీఎంనని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ తలుచుకుంటే చంద్రబాబుకు విపక్ష నేత హోదా కూడా ఉండదని పెద్దిరెడ్డి తెలిపారు. కరోనా సాకుతో స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం ఏ మాత్రం సరికాదని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.


Full View


Tags:    

Similar News