చంద్రబాబుకు మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్.. నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా..
టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. పులివెందుల నుంచి రౌడీలను తీసుకొచ్చారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ పులివెందుల నుంచి రౌడీలు వచ్చారని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నిరూపించకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని సవాల్ విసిరారు.
ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకి ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పించిందని పోలీసులపై చంద్రబాబు,లోకేష్ విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు, లోకేష్ పోలీసులపై దారుణంగా మాట్లాడుతున్నారని పోలీసులు లేకపోతే చంద్రబాబు క్షేమంగా తిరిగి వెళ్లేవారా అని ప్రశ్నించారు.