అందుకే వైసీపీలోకి.. జూపూడి ప్రభాకర్ రావు

Update: 2019-10-08 08:32 GMT

ఏపీలో ఎన్నికల అనంతరం జూపూడి ప్రభాకర్ రావు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. టీడీపీతో తెగతెంపులు చేసుకుంటారని కొంత కాలంగా వార్తలూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో జూపూడి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తాను పార్టీ ఎందుకు మారారో వివరించారు.

మంచి పరిపాలన కావాలని, రాజన్న రాజ్యం మరోసారి వస్తుందని ప్రజలు జగన్ ను ఆశీర్వదించారని చెప్పిన జూపూడి ఈ దిశలో జగన్ ముందడుగు వేస్తున్నారన్నారు. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా కేబినెట్ లో ఐదుగురు దళితులకు స్థానం కల్పించిన ఘనత జగన్ దేనని అన్నారు. ఈ అంశాన్ని దేశమంతా ఆదర్శంగా తీసుకుందని, మద్య నిషేధం, వాహనమిత్ర, నవరత్నాల అమలు తదితర అంశాల్లో జగన్ వేస్తున్న అడుగులు తనకు స్ఫూర్తి నిచ్చాయని జూపూడి తెలిపారు. అందువల్లే జగన్ వెంట నడిచి, రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలని భావించానని చెప్పారు. అందువల్లే పార్టీలో చేరానని అన్నారు. జగన్ పరిపాలన ప్రతి రాష్ట్ర సీఎంకూ ఆదర్శంగా నిలిచిందని పొగడ్తలు కురిపించారు. తనవైపున కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని, వాటిని సరిదిద్దుకుంటానని జూపూడి ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News