రాయలసీమ జిల్లాల్లో జనసేన ఇంఛార్జుల నియామకం

Update: 2020-01-08 01:42 GMT

ఇటీవల తన పర్యటన సందర్బంగా నియోజకవర్గ ఇంచార్జిల నియామకం చేపడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల కిందట పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్డుల నియామకాలు చేపట్టారు. ఈ క్రమంలో రాయలసీమలోని మూడు జిల్లాల్లో పలు నియోజకవర్గాలకు ఇంఛార్జ్డులను జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. రాజంపేట పార్లమెంటు స్టానంతోపాటు అనంతపురం జిల్లాకి చెందిన ఏడు, కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించి.. నాలుగేసి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్డులను నియమిస్తూ.. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు.

అనంతపురం జిల్లా:

1 అనంతపురం అసెంబ్లీ - టి.సి. వరుణ్‌

2. ధర్మవరం - చిలకం మధుసూదన్‌ రెడ్డి

3. రాయదుర్గం - కె.మంజునాథ్‌ గౌడ్‌

4. రాప్తాడు - సాకే పవన్‌ కుమార్‌

5. హిందూపురం - ఆకుల ఉమేష్‌

6. తాడిపత్రి - కదిరి శ్రీకాంత్‌ రెడ్డి

7. కదిరి - భైరవ ప్రసాద్‌

కడప జిల్లా :

రాజంపేట పార్లమెంట్‌: సయ్యద్‌ ముకరం చాంద్‌

1. కడప అసెంబ్లీ - సుంకర శ్రీనివాస్‌

2. రైల్వే కోడూరు - డా. బోనాసి వెంకట సుబ్బయ్య

3. రాయచోటి - షేక్‌ హుస్సేన్‌ బాషా

4. మైదుకూరు - పందిటి మల్హోత్ర

కర్నూలు జిల్లా :

1 పాణ్యం - చింతా సురేష్‌

2. ఎమ్మిగనూరు - శ్రీమతి రేఖా గౌడ్‌

3. ఆదోని - మల్లికార్జున రావు (మల్లప్ప)

4. నందికొట్కూరు - డా. అన్నపరెడ్డి బాలవెంకట్‌

ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే ఇంచార్జిలను నియమించారు పవన్ కళ్యాణ్.. త్వరలో మరోసారి రాయలసీమలో పర్యటించి.. మిగిలిన లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఇంచార్జిలను నియమించనున్నట్టు పార్టీ అధిష్టానం వెల్లడిస్తోంది. అయితే ఇంచార్జి పదవులు దక్కని వారు పవన్ కళ్యాణ్ ను కలవాలని అనుకుంటున్నారు. మరోవైపు అమరావతిలో రైతులకు మద్దతుగా జనసేన పోరాటం చేస్తోంది.  

Tags:    

Similar News