కర్నూలులో చేయి దాటిపోయింది.. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2020-04-25 04:22 GMT
Pawan Kalyan (File Photo)

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం కర్నూలు జిల్లాపై ప్రత్యేక దృష్టిపెట్టి కరోనా నివారణ చర్యలు చేపట్టకుంటే పరిస్దితి చేదాటి పోతుందని అన్నారు. కర్నూలకు ప్రత్యేక బృందాలను పంపించి సరైన వ్యూహంతో కరోనాను కట్టడి చేయాలని సూచించారు. ఆందోళనలో ఉన్న ప్రజల్లో మనోధైర్యం నింపాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ కోరారు.

తనకు కర్నూలు పరిస్థితిని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లేఖ ద్వారా వివరించారని, కర్నూలు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు పవన్ కల్యాణ్. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు 27 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 955కు చేరింది. వీరిలో 145 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 29 మంది మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 781గా ఉంది.






Tags:    

Similar News