Andhra Pradesh: మల్లాది విష్ణుకి నా శుభాకాంక్షలు: మాజీ సీఎస్ ఐవైఆర్
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవదాయ శాఖ కార్యదర్శి ఉషారాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్లాది విష్ణు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మనుగా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు. మల్లాది విష్ణుకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మాజీ సీఎస్, బీజేపీ నాయకులు ఐవైఆర్ కృష్ణారావు కూడా మల్లాది విష్ణుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో.. 'ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మల్లాది విష్ణు గారికి నా మనః పూర్వక శుభాకాంక్షలు. వారి నేతృత్వంలో సంస్థ మరియు అనుబంధ సంస్థ అయిన సహకార సంస్థ బలపడి, సామాజిక వర్గం లో వెనుకబడిన వారికి పూర్తి సహాయ సహకారాలు అందచేస్తారు అని ఆశిస్తున్నాను.' అంటూ కృష్ణారావు పేర్కొన్నారు. కాగా కృష్ణారావు సీఎస్ గా రిటైర్ అయిన తరువాత ఆంధ్రప్రదేశ్ తొలి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా కొంతకాలం పనిచేశారు. అయితే అప్పటి ప్రభుత్వంతో విబేధాల కారణంగా ఆయన తన పదవిని కోల్పోయారు. ఆయన తరువాత టీడీపీ నేత ఆనంద్ సూర్య ఏడాదిన్నర పాటు పనిచేశారు.
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మల్లాది విష్ణు గారికి నా మనః పూర్వక శుభాకాంక్షలు. వారి నేతృత్వంలో సంస్థ మరియు అనుబంధ సంస్థ అయిన సహకార సంస్థ బలపడి, సామాజిక వర్గం లో వెనుకబడిన వారికి పూర్తి సహాయ సహకారాలు అందచేస్తారు అని ఆశిస్తున్నా ను. pic.twitter.com/9bBbs1VOQS
— IYRKRao , Retd IAS (@IYRKRao) January 11, 2020