వైసీపీకి ఆయన రూపంలో మరో షాక్ తగలనుందా..?

Update: 2019-03-10 04:35 GMT

ఇప్పటికే కొంతమంది సీట్లు దక్కని వైసీపీ నేతలు టీడీపీకి జై కొట్టగా.. తాజాగా ఆ పార్టీకి మరో షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత ఘంటా మురళీ రామకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. చింతలపూడిలో తనకు కాకుండా వేరేవాళ్లకు టిక్కెట్ కేటాయించడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. దాంతో ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఏలూరి ఎంపీ మాగంటి బాబుతో ఆయన భేటీ అయ్యారు.

వైసీపీకి ఎప్పుడు రాజీనామా చెయ్యాలి, టీడీపీలో ఎప్పుడు చేరాలన్న విషయంపై ఎంపీతో చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. 2014 ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బూర్ల దేవి ప్రియ వైపే వైసీపీ మళ్ళీ మొగ్గుచూపుతోంది. దీంతో తనకు టిక్కెట్ దక్కదన్న అభిప్రాయంతో ఘంటా మురళీ రామకృష్ణ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.ఈ నియోజకవర్గంనుంచి మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్ రావు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కుమారుడు కోటగిరి శ్రీధర్ ఏలూరి పార్లమెంటు వైసీపీ ఇంఛార్జిగా ఉన్నారు. 

Similar News