Srikakulam: చెత్తకుప్పకు నిప్పు పెట్టిన గ్రామస్తులు.. ఈదురుగాలులు వీయడంతో ఇళ్లకు అంటుకున్న మంటలు
Srikakulam: పలు ఇళ్లలో పేలుతున్న వంటగ్యాస్ సిలిండర్లు
Srikakulam: చెత్తకుప్పకు నిప్పు పెట్టిన గ్రామస్తులు.. ఈదురుగాలులు వీయడంతో ఇళ్లకు అంటుకున్న మంటలు
Srikakulam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం పోరాం గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న చెత్తకు నిప్పు పెట్టడంతో.. అగ్గిరవ్వలు ఎగిరిపడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్రామంలో పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇక ఇదే క్రమంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో... మంటలు ఊరంతా వ్యాపించాయి. ఈదురుగాలులు ఎక్కువ అవ్వడంతో.. మంటల ఉధృతి పెరిగింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.