ఏపీలో ఆ పథకాల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. డీబీటీ నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్
AP: నిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1,480కోట్లు.. విద్యాదీవెన కింద రూ.502 కోట్లు విడుదల
AP: ఏపీలో ఎన్నికలు ముగియటంతో.. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు యాక్షన్ ప్లాన్ ప్రారంభించింది. డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న ఒక్కరోజే ఆసరా పథకానికి 1, 480 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్‌కు 502 కోట్లు విడుదల
చేసింది. మిగిలిన పథకలకూ మరో రెండు మూడు రోజుల్లో నిధులను విడుదల చేయనుంది ప్రభుత్వం. అయితే.. టీడీపీ ఫిర్యాదుతో డీబీటీ నిధుల విడుదలను ఎన్నికల సంఘం అడ్డుకుంది. ఎన్నికల సంఘం నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా.. ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. ఎన్నికలు ముగియటంతో.. నిధుల విడుదలకు ఈసీ అనుమతించింది.