ఏపీలో 13 మంది తహశీల్దార్లకు కరోనా పరీక్షలు

ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే అయిదు కేసులు నమోదు అయ్యాయి.

Update: 2020-04-16 05:39 GMT
Representational Image

ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే అయిదు కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. మ‌రో 20 మంది బాధితులు డిశార్చ్ అయ్యారు. ప్రస్తుతం 491 మంది చికిత్స పొందుతున్నారు. ఉద‌యం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించిన ప‌రీక్షల్లో కర్నూలు 13, గుంటూరులో 4, కడపలో 3, నెల్లూరులో 2, అనంతపురం ఒక కేసు నమోద‌య్యాయి. ఐదుగురు మ‌ర‌ణించారు.

అయితే కరోనాని అరికట్టడానికి అధికారులు కుడా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో 13 మంది తహశీల్దార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టరేట్‌ సూచించారు. కేంద్రం విడుదల చేసిన హాట్‌స్పాట్‌ ప్రాంతాల జాబితాలో చిత్తూరు జిల్లా కూడా ఉండటం.. అనంతపురం జిల్లాలో ఓ తహశీల్దార్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో అప్రమత్తం అయ్యారు.

చిత్తూరు జిల్లాలోని రెడ్‌జోన్ల పరిధిలో ఉన్న రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, వడమాలపేట, పుత్తూరు, నగరి, నిండ్ర, విజయపురం, నారాయణవనం, పలమనేరు తహశీల్దార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.


Tags:    

Similar News