తెలుగు రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు...1500 వందల వరకు కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాలను క‌రోనా వణికిస్తోంది. గ‌త రెండు మూడు రోజులుగా కరోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.

Update: 2020-04-19 04:59 GMT

తెలుగు రాష్ట్రాలను క‌రోనా వణికిస్తోంది. గ‌త రెండు మూడు రోజులుగా కరోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.కోవిడ్ కేసులు న‌మోద‌వుతున్న తీరు ఆందోళన కలిగస్తున్నాయి. దీంతో ఇరురాష్ట్రాల ప్ర‌భుత్వాలు మ‌రింత అప్ర‌మ‌త్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో చ‌ర్య‌లు చేప‌ట్టారు. లాక్‌డౌన్‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాలలో సంఖ్య సుమారుగా 15 వంద‌ల‌కు చేరింది.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 809 కి చేరుకుంది. తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం శ‌నివారం రాత్రి వ‌ర‌కు తెలంగాణలో మొత్తం 43 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 31 కేసులు హైదరాబాద్ పరిధిలోనే న‌మోదుకావ‌టం గ‌మ‌నార్హం. అయితే, శ‌నివారం రోజున చికిత్స పొందుతున్న వారిలో ఎవరూ డిశ్చార్జ్ కాలేదు.

అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండరాదని, ప్రతి ఒక్కరి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం కేసీఆర్ శనివారం మ‌రోమారు తెలిపారు. ఇవాళ సీఎం కేసిఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. లాక్ డౌన్ సడలింపు పై నిర్ణయం తీసుకోనుంది.

ఏపీలోనూ కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 603కి చేరుకుంది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 16కు పెరిగింది. రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా 260 వరకు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 70 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఐదు మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇక శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాలు కోవిడ్ ఫ్రీ జిల్లాలుగా ఉన్నాయి 

Tags:    

Similar News