విశాఖలో మళ్లీ కరోనా పాజిటివ్.. 24 గంటల్లో 647కు చేరిన కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి.

Update: 2020-04-19 06:30 GMT
Representational Image

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో జరిగిన కొత్తగా 44 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కర్నూలులో 26, కృష్ణా జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలో 5, విశాఖపట్నం జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 647కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 17 మంది మరణించారు, 65 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 565గా ఉంది.

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 158 కేసులు నమోదయ్యాయి.

♦ గుంటూరు 129,

♦ కృష్ణా జిల్లా 75,

♦ నెల్లూరు 67,

♦ ప్రకాశం 44,

♦ కడప 37,

♦ అనంతపురం 29,

♦ చిత్తూరు 28,

♦ తూర్పు గోదావరి 24,

♦ పశ్చిమ గోదావరి 35,

♦ విశాఖపట్నం 21,

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతానికి ఒక కేసు నమోదుకాలేదు.




Tags:    

Similar News