సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇళ్ల పట్టాలు పంపిణీపై మరోసారి డేట్ ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పేదలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2020-04-24 12:36 GMT
YSJagan(File photo)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పేదలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు.గతంలో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన వచ్చిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్ళీ చేపట్టనుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో సీఎం ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ద్వారా బటన్‌ నొక్కి నగదు బదిలీ చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలతో మాట్లాడారు.. ఈ సందర్భంగా జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున ఇళ్ళ పట్టాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.

ఈ పథకం ద్వారా 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని సీఎం తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పారు. అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్ పదవుల్లో 50% ఇవ్వాలని గొప్ప చట్టం తెచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు అడ్డుకట్ట వేయడానికి దిశా చట్టం తేసుకొచ్చమని, రాష్ట్రపతి కూడా ఈ చట్టానికి ఆమోదం తెలూపుతారాని భావిస్తున్నట్లుగా ఆయన తెలిపారు.

అంతకుముందు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం డ్వాక్రా సంఘాల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఆన్‌లైన్‌ బటన్‌ నొక్కి మహిళల ఖాతాలోకి నగదు బదిలీ చేశారు. ఈ బటన్‌ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో cfms ద్వారా ఒకే విడతలో డబ్బులు జమ అయ్యాయి. రాష్ట్రంలోని 90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే పొదుపు సంఘాల అకౌంట్స్ లో రూ.1,400 కోట్లు జమ అయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని సీఎం జగన్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా విద్యార్థుల తల్లుల అకౌంట్‌ల్లోకే బదిలీ అవుతాయని, మూడు నెలల సంబంధించి రీయింబర్స్‌మెంట్‌ జమ చేస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

Tags:    

Similar News