ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

Update: 2019-11-12 08:46 GMT

ఏపీలో ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ప్రారంభించారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌సోర్స్‌డ్‌ ఎంప్లాయిస్‌ (ఏపీ ఆప్‌కాస్‌) వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకు ప్లేస్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్పొరేషన్ పరిధిలోకి జిల్లా, సెక్రటేరియట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కల్పనలో లంచాలు బెడదను అడ్డుకట్ట వేయనున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. జిల్లా స్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.  

Tags:    

Similar News