Megastar Chiranjeevi: చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తూ చిరంజీవి ట్వీట్!

Update: 2020-04-20 03:50 GMT

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం (ఏప్రిల్ 20) సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా చాలా మంది ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి చంద్ర‌బాబుకు త‌న ట్విట్ట‌ర్ ద్వారా జన్మదిన శుభాంకాంక్షలు తెలిపారు.

'దశాబ్దాలుగా అహర్నిశం ప్రజా సేవలో కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడిని కోరుతున్నాను. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సర్. మీ దూరదృష్టి, కష్టపడే మనస్తత్వం, అంకితభావం అత్యున్నతమైనవి' అని చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో పాటు గతంలో చంద్రబాబుతో ఓ వేడుక సందర్భంగా సరదాగా గడిపిన ఒక ఫోటోను షేర్ చేశారు.


 

Tags:    

Similar News